ఎమ్మెల్యే గాంధీని వెంటనే అరెస్టు చేయకుంటే రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తాం

ఎమ్మెల్యే  గాంధీని వెంటనే అరెస్టు చేయకుంటే రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తాం

పోలీసులను అడ్డుపెట్టుకొని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి


 గత ఎన్నికల్లో హామీలను వెంటనే ఏర్పాటు చేయాలి మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ తాజా మాజీ జెడ్పిటిసి గుప్తా..

ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు రమణ గౌడ్ మహేష్ గుప్తా హెచ్చరిక..

 జనం న్యూస్ సెప్టెంబర్14.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

రాష్ట్రంలో పోలీసులను అడ్డం పెట్టుకొని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న సిఎం రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన అరికెపూడి గాంధీ వెంటనే అరెస్టు చేయని పక్షంలో రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని  శివంపేట  తాజా మాజీ జెడ్పిటిసి పబ్బా మహేష్ శివంపేట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు  గుప్త. రమణ గౌడ్,ఆగ్రహం వ్యక్తం చేశారు.  తాజా మాజీ జెడ్పిటిసి గుప్తా. శివంపేట  మండల టిఆర్ఎస్  పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్  విలేకరులతో మాట్లాడుతూ గత  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కొస్తే రైతులకు రుణమాఫీ చూస్తామని రైతులకు రైతుబంధు ఇస్తామని  కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వృద్ధులకు 4000 వికలాంగులకు 6000 పింఛన్  మహిళకు 2500 రూపాయలు ఎన్నికలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని శివంపేట మండల తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ  మహేష్ గుప్తా శివంపేట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వై రమణ గౌడ్ డిమాండ్ చేశారు      కాంగ్రెస్ గుండాలతో దాడి చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని వదిలిపెట్టి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అక్రమ కేసు నమోదు చేయడం సిగ్గుచేటని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ కి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పబ్బ మహేష్ గుప్తా రమణ గౌడ్ అన్నారు  న్యాయబద్ధంగా నామినేషన్ వేసిన మాజీ మంత్రి హరీష్ రావుకు పిఎసి చైర్మన్ పదవి దక్కాల్సి ఉండగా, కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి గాంధీకి ఇవ్వడం దురదృష్టకరమని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నేతలను వదిలి పెట్టమని, ఉద్యమనేత, తొలి సిఎం కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా  విమర్శలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన మోసపూరిత విధానాలు మానుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని సాధించిన నేతగా కెసిఆర్ కు ఉద్యమాలు కొత్త కాదని, మరింత రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్ర ప్రజలను సంఘటితం చేస్తూ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో విలేకరుల సమావేశంలో , మాజీ జెడ్పిటిసి పబ్భ మహేష్ గుప్త, మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షులు లక్ష్మీ నరసయ్య. వంజరి కొండల్ , తాజా మాజీ ఎంపీటీసీ నువ్వులదశరథ ,వజ్జ హరి ,సాయి , పంబాల సందీప్, గోమారంఅజయ్ ,తదితరులు పాల్గొన్నారు.