తాతముత్తాతల కాలం నుండి భూమిని మేమే కాస్తు చేస్తున్నాం....

తాతముత్తాతల కాలం నుండి భూమిని మేమే కాస్తు చేస్తున్నాం....

చిన్నగొట్టిముక్కుల గ్రామంలో భూబాధితుల ఆవేదన...

సర్వేనెంబర్ 31లో 13 ఎకరాలలో పంటలు పందించుకుంటున్నామని వెల్లడి..

ఎవరో వచ్చి ఈభూములను మేము కొనుగోలు చేశామంటున్నారని ఆవేదన..

జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి   మాకు న్యాయం చేయాలని వేడుకోలు..

 జనం న్యూస్ సెప్టెంబర్19.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

తాతముత్తాతల కాలం నుండి వంశపారపర్యంగా వచ్చిన భూములను ఎన్నో ఏండ్లుగా కాస్తు చేసుకొని పంటలు పండించి మాకుటుంబాలను పోషించుకుంటున్నామని చిన్నగొట్టిముక్కుల భూబాధితులు సయ్యద్ అన్వర్, సయ్యద్ రసూల్, సయ్యద్ ఉస్మాన్, యాసిన్, రషీద్, ముజీబ్, మహాముద్, సలీం, జాఫర్, సాధక్, రహమాన్ గురువారం విలేకరులతో తెలిపారు. సర్వేనెంబర్ 31లో 13 ఎకరాల భూమిని దున్నుకుని బ్రతుకుతున్నామని, ఇప్పుడు ఎవరో వచ్చి మేము ఈభూములు కొన్నామని వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొజిషన్ లో మేముండగా అధికారులు ఇతరులకు ఓఆర్సీ సర్టిఫికెట్లు ఎలా జారీ చేస్తారని బాధితులు మండిపడ్డారు.  న్యాయం చేయాల్సిన అధికారులే చిన్న విషయాన్నీ పెద్దదిగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి సర్వే నిర్వహించేందుకు తక్కువ సమయం ఇచ్చి తహసీల్దార్ కార్యాలయం నుండి మాకు నోటీసులు అందించారాని, ప్రస్తుతం మేము కోర్టులో భూమి కోసం కేసు వేశామని గుర్తు చేశారు. మాభూములపై ఎవరో పెద్దల కన్ను పడిందని, పెద్దల కనుసన్నలలోనే అక్రమంగా మాభూములు గుంజుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చిన్నగొట్టిముక్కులలో జరుగుతున్న భూఆక్రమాణలపై మెదక్  జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.