కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే జీఎస్సార్.
జనం న్యూస్ అక్టోబర్ 2 శాయంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 62 మంది కళ్యాణ లక్ష్మి స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అందజేశారు అనంతరం. వారు మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఎంతో అండగా కళ్యాణలక్ష్మి పథకం నిలుస్తుందని తెలిపారు. ఈ పథకం ప్రజాప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందుతుందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద, నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లిళ్లకు భారం తగ్గిందని గుర్తుచేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించినట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రభుత్వం ద్వారా ఇచ్చే సబ్సిడీ గ్యాస్, రేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలను కూడా మహిళల పేర్లమీదనే పంపిణీ చేస్తామన్నారు. ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో యంపిడిఓ ఫణి చంద్ర పరకాల వ్యవసాయ కమిటీ చైర్మన్ మాలపల్లి రవీందర్ మాజీ జెడ్పిటిసి చల్ల చక్రపాణి మాజీ ఎంపీపీ బసాని చంద్రప్రకాష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.....