శాయంపేట మండలం లో బీఆర్ ఎస్ పార్టీ జెండా ఎగరేయాలి
జనం న్యూస్ అక్టోబర్ 1 శాయంపేట మండలం భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ రూరల్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ & బీఆర్ ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి ఆదేశానుసారం
క్షేత్రస్థాయిలో బీఆర్ ఎస్ పార్టీ బలోపేతానికి వివిధ గ్రామాల్లో శాయంపేట మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో పర్యటనలో భాగంగా ఈరోజు గోవిందపూర్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి వివిధ గ్రామాల్లో పర్యటించి కొద్ది నెలల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో పూర్తిస్థాయిలో అన్ని స్థానాలను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త ఐక్యమత్యంతో కలిసికట్టుగా పని చేసి శాయంపేట మండలంలో బిఆర్ఎస్ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.
గోవిందపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా దాసి శ్రావణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ప్రధాన కార్యదర్శి నర్రా రాజు ఉపాధ్యక్షులుగా బొత్స మహేందర్ బైరి రాజకుమార్ సంయుక్త కార్యదర్శిగా రాజేశ్వరరావు ప్రచార కార్యదర్శి కాల్వల సతీష్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో మండల కమిటీల కోఆర్డినేట్ సభ్యులు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారేపల్లి నందం మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గుర్రం రవీందర్ మాజీ ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు మేకల శ్రీను మాజీ ఎంపీటీసీ విష్ణువర్ధన్ రెడ్డి, గడిపే విజయ్ మాజీ సర్పంచ్ అరికిల్ల ప్రసాద్ బైరి శ్రీను, బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మండల ముఖ్య నాయకులు మారేపల్లి మోహన్ కరుణ్ బాబు, పాల్గొన్నారు...