కుంగిపోయిన మేన్ కెనాల్ పరిశీలించినా ఎమ్మేల్సీ టి జీవన్ రెడ్డి
జనం న్యూస్ సెప్టెంబర్ 28 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం లోని బీర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని రోళ్లవాగు మేన్ కెనాల్ కుంగిపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులు నాయకులతో కెనాల్ పరిశీలించి ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడారు స్పదించిన అధికారులు సోమవారం లోపు పనులు ప్రారంభించి మరమ్మతులు చేస్తామని తెలిపారు
అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
గత ప్రభుత్వం కెనాల్ ఆయకట్టుల పున మరమ్మతుల పనులను చేపట్టలేదని అందుకే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అన్నారు కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ బ్రడ్జి పై నుండి కమ్మునూర్ బ్రడ్జి నిర్మాణం జరిగి రహదారి లింక్ కలవడంతోని బారి వాహనాల సంఖ్య పెరగడంతోని బ్రడ్జి కుంగి కూలింది అని అన్నారు
బీర్పూర్ పోలీస్ అధికారులతో మాట్లాడి ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి అని సూచించాను అని తెలిపారు
సోమవారం రోజున మరమ్మతుల పనులు ప్రారంభమవుతాయని తెలిపారు
గత ప్రభుత్వం రైతు కమిటీలను నిర్వీర్యం చేశాయని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రైతు కమిటీల ద్వారా కెనాల్ నిర్మాణాలు చేపట్టాలి అని ప్రభుత్వానికి సూచిస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొల్వాయి సింగిల్ విండో చేర్మెన్ మాజీ ఎంపీపీలు మాజీ సర్పంలు మాజీ ఎంపీటీసీలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు...