*ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో ఎల్ఈడి ట్యూబ్ లైట్ వర్క్ షాప్*
జనం న్యూస్ సెప్టెంబర్ 28: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎల్ఈడి ట్యూబ్ లైట్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన 50 ఎల్ఈడి ట్యూబ్ లైట్ మెటీరియల్ తెప్పించి ఫిజికల్ సైన్స్ టీచర్ గాండ్ల రాజశేఖర్ పర్యవేక్షణలో విద్యార్థుల చేత తయారు చేయించినట్లు తెలియజేశారు అదేవిధంగా నేర్చుకున్న సైన్సును నిత్యజీవితంలో అనువర్తింప చేయడమేకాకుండా నిజమైన పరిజ్ఞానం వస్తుంది అని మాట్లాడారు. గైడ్ టీచరుగా వ్యవహరించినటువంటి గాండ్ల రాజశేఖర్ మాట్లాడుతూ ఎల్ఈడి ట్యూబ్ లైట్లను వాడడం వలన విద్యుత్ శక్తిని ఆదా చేయవచ్చని అదేవిధంగా మన ఇండ్లలో కూడా ఎల్ఈడి బల్బులని వాడుట వలన లాభం గురించి తల్లిదండ్రులకు తెలియజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మునిరుద్దీన్,ప్రసాద్, పవన్, రాజేందర్, రాజ నర్సయ్య, ఎస్ శ్రీనివాస్, సమిత, కే శ్రీనివాస్ విజయ్ కుమార్,ప్రవీణ్ శర్మ, ఇందిరా, గంగాధర్, సబిత పాల్గొన్నారు