గంజాయి కేసులో 7గురు ముద్దాయిలు అరెస్టు
- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 06 సెప్టెంబర్
విజయనగరం టౌన్
గోపికృష్ణ పట్నాయక్(రిపోర్టర్)
గంజాయి కేసులో 7గురు నిందితులను అరెస్టు చేసి, 2 కిలోల గంజాయి, 1 స్కూటీ, రూ.400/- లు నగదు స్వాధీనం చేసుకున్న డెంకాడ పోలీసులు
విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతలవలస గ్రామంలో గల ఎం.వి.జి.ఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు ఎదురుగా ఉన్న నీలగిరి తోటలో గంజాయి విక్రయిస్తున్న, సేవిస్తున్న 7గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్దనుండి 2 కిలోల గంజాయి డెంకాడ పోలీసులు స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండుకు తరలించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - విజయనగర జిల్లా డెంకాడ మండలం, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన వ్యక్తితో కలసి డెంకాడ మండలం చింతలవలన గ్రామంలోని ఎం.వి.జి.ఆర్ కళాశాలకు దగ్గరలో గల నీలగిరి తోటలో గంజాయి విక్రయిస్తున్నట్లుగా సెప్టెంబరు 4న డెంకాడ పోలీసులకు వచ్చిన నమ్మదగిన సమాచారంపై డెంకాడ ఎస్ఐ సన్యాసి నాయుడు మరియు ఇతర పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులతో కలిసి రైడ్ చేసి, నీలగిరి తోటలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని, గంజాయి సేవిస్తున్న మరో నలుగురుని అదుపులోకి తీసుకొన్నారన్నారు. వీరి వద్ద నుండి రెండు కిలోల గంజాయి, ఒక స్కూటీ, రూ. 400/-ల నగదును డెంకాడ పోలీసులు స్వాధీనం చేసుకొని, విచారణ చేపట్టారన్నారు. విచారణలో (ఎ-1) అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం వంచనారంగిని గ్రామం, బూర్జ పంచాయితీకి చెందిన సామర్ధి నాగేశ్వరరావు (23సం.లు), (ఎ-2) శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలానికి చెందిన గణేశ్వరం సంజయ కుమార్ (18సం.లు), (ఎ-3) విజయనగరం జిల్లా డెంకాడ మండలం, రఘుమండ గ్రామానికి చెందిన దుర్గాసి కనకరాజు (24నం.లు), (ఎ-4) శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటువల్లి గ్రామానికి చెందిన టొంపల నాగభూషణం (18 సం.లు) (ఎ-5) శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలానికి చెందిన రాజమహాంతి అనిల్ కుమార్ (23సం.లు) (ఎ- 6) డెంకాడ మండలం, రఘుమండ గ్రామానికి చెందిన బత్తుల కిరణ్ (24సం.లు) (ఎ-7) డెంకాడ మండలం, చింతలవలన గ్రామానికి చెందిన చీకటి నందీప్ (22సం.లు) అనే నిందితులందరూ గంజాయి సేవించడానికి, విక్రయించడానికి అలవాటు పడ్డారన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన ఎ-1 నిందుతుడు సామర్ధి నాగేశ్వరరావు గంజాయి పండిస్తాడని అతనితో ఎ-2, ఎ-3 నిందితులు పరిచయం ఏర్పడి ఎ-1 వద్ద నుండి గంజాయిని కొనుగోలు చేసి విజయనగరం తీసుకొని వచ్చి విక్రయిస్తారన్నారు. వీరు విజయనగర జిల్లాలో గంజాయి అవసరం ఉన్న వారికి, కళాశాల విద్యార్థులకు, చిన్న మొత్తాల్లో విక్రయించే వారికి గంజాయి అమ్ముతుంటారన్నారు. ఈ క్రమంలో తే. 04.09.2024న డెంకాడ మండలం చింతలవలస గ్రామంలో గల ఎం.వి.జి.ఆర్ ఇంజినీరింగ్ కళాశాల దగ్గరలో గల నీలగిరి తోటలో గంజాయి విక్రయిస్తున్నట్లు, కొంతమంది గంజాయి సేవిస్తున్నట్లుగా వచ్చిన సమాచారంపై రైడ్ చేసి గంజాయి విక్రయిస్తున్న, సేవిస్తున్న 7గురిని అరెస్టు చేసి 2 కేజిల గంజాయి, 1 స్కూటీ, రూ. 400/-లను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణకు పాల్పడినా, విక్రయించినా, గంజాయి సేవించినా కఠినంగా వ్యవహరిస్తున్నామని, అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు.