గత ప్రజా ప్రతినిధులు చేసిన అభివృద్ధి గద్వాల పట్టణానికి బాటలు వేశాయి కానీ ఇప్పుడేం జరుగుతుంది...
జనం న్యూస్ 27 డిసెంబర్ 2024 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా
మాజీ మంత్రి డీకే సమరసింహ రెడ్డి ఆధ్వర్యంలో 1990 తరువాత కృష్ణా పుష్కరాలకు రాజీవ్ మార్గ్ వచ్చి ఉండొచ్చు అనుకుంటా.ఇప్పటికి కూడా ఇది గద్వాల పట్టణానికి అందమయిన రాజీవ్ రహదారి అయ్యింది..ఇది కాదనలేని సత్యం ఈ రోడ్డు దాటి ఊరు అభివృద్ధి చెందడానికి 30 ఏళ్ళు పట్టింది ...1990 తరువాతనే అదే మాజీ మంత్రి గౌ శ్రీ డీకే సమరసింహ రెడ్డి తెచ్చిన 10th బెటలియన్ ఎర్రవల్లి జంక్షన్ లో పెడితే ఆ జంక్షన్ అభివృద్ధి లోకి రావడానికి 30 ఏళ్ళు పట్టింది అది కూడా NH44 లో వున్నా కూడా మాజీ MLA పాగాపుల్ల రెడ్డి 40 ఏళ్ల క్రితం మార్కెట్ యార్డ్ తీసుకొస్తే 40 ఏళ్లలో ఇప్పుడిప్పుడు ఆ ప్రాంతం దాటి మెల్లగా అభివృద్ధి కి ఊపందుకుంటుంది వీటిని అందరూ గమనిస్తున్నా కూడా కోర్ట్ ను 12 కిలోమీటర్ల దూరం తరలిస్తేనే భవిష్యత్ ఉంటుందని వితండవాదం చేస్తే.... మెజారిటీ న్యాయవాదులు ఏమి చెప్పలేకనే నిరసనకు దిగడం జరిగింది జిల్లా ప్రజలంతా మద్దత్తు తెలుపుతుంటే కూడా దాన్ని వ్యతిరేకిస్తున్న 4% వ్యక్తులు మాదే కరెక్ట్ అంటే దానికి కాలమే సమాధానం చెబుతుంది*
➖మాజీ MLA శ్రీ పాగాపుల్ల రెడ్డి గారు,మాజీమంత్రి గౌ శ్రీ సమరసింహ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ప్రణాళిక బద్దంగా చేసిన అభివృద్ధి ...అందుకే పట్టణం ఒక క్రమపద్ధతిలో ఉంది అదే పంథాను కొనసాగిస్తూ మాజీ MLA శ్రీ గౌ డీకే భరత్ సింహ రెడ్డి గారు,శ్రీ గౌ గట్టు భీముడు గారు,శ్రీమతి గౌ డీకే అరుణమ్మ గారు కొనసాగించారు....
➖అందుకే గద్వాల పట్టణం అందంగా నిండుగా 6 నుంచి 7 కిలోమీటర్లు చుట్టుముట్టు పెరిగింది ఇది ఎవరు కాదనలేని సత్యం
➖తెలంగాణ వచ్చిన తరువాత అభివృద్ధి పేరిట వచ్చిన జిల్లా కలెక్టర్ కార్యాలయం,SP ఆఫీస్,మెడికల్ కాలేజీ లాంటి పెద్ద వ్యవస్థ లను ఊరికి కొంచెం దూరం లో అంటే మీరు చెప్తున్న అనంతపురం గుట్టల్లో పంపి ఉండుంటే ఈ రోజు ఊరు మీరంటున్నట్టు స్పీడ్ గా అభివృద్ధి లోకి వచ్చి ఉండేది
➖పేదలు ప్లాట్ లు పేదలకు ఇచ్చి ఉండివుంటే ఈ రోజు 1650 ఇండ్లు కట్టుకొని 1650 కుటుంబాలు వచ్చి ఉంటే ఒక పెద్ద కాలనీలు తయారయ్యి ఉండేవి
➖ఇప్పుడు కట్టుకున్న కలెక్టర్, SP, కార్యాలయాలు,exice ఆఫీసులు మీరంటున్న అనంతపురం గుట్టల్లోకి తరలించి ఉండి ఉంటే ఆ ప్రాంతం అంతా పూర్తిగా అభివృద్ధి చెంది ఉండేది ఈ PJP కార్యాలయ భూమి ప్రభుత్వం భూమిగా మిగులు భూమిగా ఉండి ఉండేది
➖ఇదే మిగులు భూమి లో మెడికల్ కాలేజీ,జిల్లా కోర్ట్,రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఆ పీజేపీ కార్యాలయ మిగులు భూమిలో వచ్చి ఉండుంటే తెలంగాణ లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా పెరు వచ్చి ఉండేది వ్యాపార కేంద్రం గా గద్వాల ఒక వెలుగువెలిగి ఉండేది
➖ఇది గద్వాల ప్రజాప్రతినిధులు చేసిన పెద్దతప్పు
➖ఇప్పుడు కూడా కోర్టు తరలింపు విషయంలో కూడా తప్పుడు నిర్ణయానికి పునాది వేయడానికి సిద్ధపడుతున్నారు...అలాంటి వారిని గద్వాల చరిత్ర క్షమించదు అనేది గుర్తుంచుకోండి మళ్ళీ మళ్ళీ తప్పు చేయొద్దండి
➖ఇప్పుడు కూడా తప్పు చేస్తే అనంతపురం గుట్టల్లో కోర్టు తప్పా ఇక ఏ ఆఫీస్ కూడా అక్కడికి రావు అన్నది కాదనలేని సత్యం
➖ నిజాన్ని నిరూపించే న్యాయస్థానం ఊరవతలికా.....అడ్డుకుందాం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గద్వాల భవిష్యత్ కోసం నిరసన చేస్తున్న న్యాయవాదులకు మద్దత్తు ఇద్దాం