అయిజ మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో
జనం న్యూస్ 11 డిసెంబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా
మన ఊరు మనం బాగు చేసుకుందాం - మున్సిపల్ చైర్మన్ శ్రీ G చిన్న దేవన్న గారు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పరిధిలో 1 వ వార్డు తెలుగుపేట, మరియు 11 వ వార్డు గుర్రంతోట ఏరియాలలో నేటి ఉదయం 6:00 గం" లకు మున్సిపల్ చైర్మన్ శ్రీ G చిన్న దేవన్న గారు 11 వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి ఉప్పరి విజయలక్ష్మి గారితో కలిసి పర్యటించారు.ఈ సందర్బంగా చైర్మన్ గారు వార్డులలోని ప్రజల ను పారిశుధ్యం, మంచి నీటి సరఫరా, వీధిలైట్లు, డ్రైనేజి సమస్య లను గురించి ప్రత్యేకంగా ఆరా తిశారు.వార్డులలో అన్ని చోట్ల శానిటేషన్ సహా అన్ని పనులు సవ్యంగా సాగుతున్నాయని ప్రజలు చైర్మన్ గారికి తెలిపారు. తెలుగుపేట ఏరియాలో రెడ్డి కమ్యూనిటీ హల్ వెనుక మాత్రం రోడ్డు లేక వర్షాలు వచ్చినప్పుడు మోకాళ్ళ లోతు వర్షపు నీరు ఆగి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.అలాగే తెలుగుపేట ఏరియాకు మంచినీళ్లు గత వారం రోజులుగా రావడం లేదని వార్డు యువకులు చైర్మన్ గారి దృష్టికి తేగా నేడు మిషన్ భగీరథ పైప్ లికేజ్ వల్ల నీళ్లు రావని ముందుగానే సమాచారం కూడా ఇవ్వడం జరిగిందని రేపటినుండి యధావిధిగా నీళ్లు వస్తాయని తెలుగుపేటకు ఎందుకు నీళ్లు రావడం లేదని మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ గారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని ఇవాళ లేదా రేపటిలోగా సమస్య పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకోవాలని సూచించారు.11 వ వార్డులో ఈనెల 3 తేదీన భూమి పూజ చేసిన సీసీ రోడ్డు పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు.కార్యక్రమం లో కౌన్సిలర్ శ్రీమతి ఉప్పరి విజయలక్ష్మి , BRS నాయకులు తెలుగు నరేంద్ర మున్సిపల్ ఇంచార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ రంగన్న వాటర్ లైన్ మెన్ శ్రీ నర్సింహులు వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్,జవాన్లు, ఎలక్ట్రీషియన్లు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు