*గిరిజనుల సమస్యలను పరిష్కరించండి*

*గిరిజనుల సమస్యలను పరిష్కరించండి*

జనం న్యూస్ అక్టోబర్ 31(మఠంపల్లి ప్రతినిధి ఎం శంకర్ నాయక్)

 గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి ప్రతి జిల్లాకు ఐటీడీఏ ఏర్పాటు చేసి గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 5 6 తేదీలలో జరిగే తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సూర్యపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం లోని ఆ సంఘం కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది మీ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాలోతు బాలునాయక్ భూక్య పాండు నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని సమస్యలు పరిష్కరించాలని అదే రకంగా గిరిజనుల సమస్యలు పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించి భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లో చేర్చి రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బానోతు వెంకటేశ్వర్లు గిరిజన సంఘం నాయకులు తేజావత్ స్వామి నాయక్ బానోతు రాజు బి సాంబయ్య ఎం లక్ష్మణ్ డి హరియా తదితరులు పాల్గొన్నారు