చిలుక సాక్ష్యం తో నిందితుడికి శిక్ష......

చిలుక సాక్ష్యం తో నిందితుడికి శిక్ష......

జనం న్యూస్: చిలుక ఏమిటి నిందితుడిని పట్టించడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా...? అవును చిలుక ముద్దు ముద్దుగా పలుకుతుంది అంటారు కదా...! జోతిస్యమే కాదండోయ్ ఏకంగా ఈ చిలుక హంతకుడిని పట్టించింది..

త‌న క‌ళ్ల‌ముందే జ‌రిగిన దారుణ‌ హ‌త్య కేసులో ఓ చిలుక నిందితులను ప‌ట్టించి పోలీసుల‌కు స‌హాయ‌ప‌డింది. ఆశ్చ‌ర్యం క‌లిగించే ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వివ‌రాలిలా ఉన్నాయి. ఆగ్రాకు చెందిన విజ‌య్‌శ‌ర్మ‌, నీల‌మ్ శ‌ర్మ దంప‌తులు. నీలమ్‌శ‌ర్మ 2014 ఫిబ్ర‌వ‌రి 20న త‌మ‌ ఇంట్లోనే హ‌త్య‌కు గురైంది. ఆమెతో పాటు వారి పెంపుడు కుక్క‌ను కూడా నిందితులు దారుణంగా పొడిచి హ‌త‌మార్చిన‌ట్టు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డైంది. 

ఈ కేసులో పోలీసులు విచార‌ణ చేప‌ట్టిన‌ప్ప‌టికీ స‌రైన సాక్ష్యాధారాలు ల‌భించ‌లేదు. మ‌రోప‌క్క ఈ హ‌త్య జ‌రిగిన త‌ర్వాతి రోజు నుంచి వారి పెంపుడు చిలుక స‌రిగా తినేది కాదు. అంతేకాదు.. విజ‌య్‌ శ‌ర్మ మేన‌కోడ‌లు అషు ఇంటికి వ‌చ్చిన ప్ర‌తిసారీ ఆమెను చూసి అరుస్తూ ఉండేది. దీంతో హ‌త్య చేసిన వారిని చిలుక చూసి ఉంటుంద‌నే అనుమానంతో విజ‌య్‌శ‌ర్మ పోలీసుల‌కు స‌మాచారం అందించాడు.