అమ్మాయిల ఎద స్థానాన్ని అసహ్యంగా తాకుతూ పిచ్చి పూజలు చేస్తున్న దొంగ బాబా (వీడియో చూడండి)

జనం న్యూస్: ఇప్పటికీ చాలా గ్రామాల్లో దొంగ బాబాలను నమ్మడం.. ఏదన్నా జబ్బు చేస్తే వైద్యుల దగ్గరికి కాకుండా ఆ దొంగ బాబాల వద్దకు వెళ్లడం వంటివి చూస్తుంటాం. ఫలానా దొంగ బాబా ఆడపిల్లలపై అఘాయిత్యం చేసాడని.. ఆశ్రమాల పేరిట అమ్మాయిన్ని పాడుచేస్తున్నాడని వార్తలు వస్తున్నా ఇంకా కొందరు గుడ్డిగా ఇలాంటి దొంగ బాబాలనే నమ్ముతున్నారు. పై ఫోటోను గమనించారా? ఓ దొంగ బాబా ఆడపిల్ల వక్షోజాలపై వత్తుతున్నాడు. ఆ అమ్మాయికి ఆస్తమా ఉందట. దాంతో ఆ పిల్ల తల్లిదండ్రులు వైద్యుల వద్దకు కాకుండా ఆ దొంగ బాబా వద్దకు తీసుకెళ్లారు. దాంతో ఆ దొంగ బాబా ముట్టుకోకూడని చోట తాకుతూ ఇలాంటి వికృత చేష్టలు చేస్తుండడంతో పాపం ఆ ఆడపిల్ల కూడా ఎంతో ఇబ్బంది పడుతోంది. పక్కనే ఉన్నవారైనా కనీసం ఆ దొంగ బాబానే ఆపేందుకు చూస్తున్నారు కానీ.. ఆ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం ఆ దొంగ వెధవ చెంప ఛెళ్లుమనిపించకుండా అలాగే చూస్తుండిపోయారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. ఆ వీడియో ఆధారంగా ఆ దొంగ బాబాను అరెస్ట్ చేయాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.