*చెత్తను శుద్ధి చేద్దాం- పర్యావరణాన్ని పరిరక్షిద్దాం* *ఎమ్మెల్యే సందరపు విజయ్ కుమార్*

*చెత్తను శుద్ధి చేద్దాం- పర్యావరణాన్ని పరిరక్షిద్దాం*   *ఎమ్మెల్యే సందరపు విజయ్ కుమార్*

అచ్యుతాపురం(జనం న్యూస్):అచ్యుతాపురం ఎంపీడీవో కార్యాలయం నందు ఏర్పాటు చేసిన స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా

 ఎన్సిసి విద్యార్థులతో మానవహారంగా ఏర్పడి ర్యాలీ నిర్వహించారు.

యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ

ప్రతి ఇంటినుండి తడిచెత్త, పొడిచెత్తా వేరుచేసే పారిశుధ్య కార్మికులకు ఇస్తే చెత్త నుండి సంపద తీసే కేంద్రాలకు తరలించి పర్యావరణ రక్షించడంతోపాటు గ్రామ పంచాయతీలకు ఆదాయం కూడా చేకూరుతుందని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కొరకు పారిశుధ్యం మెరుగుపడితే అందరూ ఆరోగ్యాలు బాగుంటాయని, మంచి అవగాహన కల్పిస్తూ చెత్త నుండి సంపద తో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడే బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సంపద కేంద్రాల నిర్వహించి చెత్తను శుద్ధి చేసే వారిని, మధ్యలో వైసీపీ ప్రభుత్వం వచ్చి వాటిని మరుగున పడిందన్నారు. భవిత స్కూలు సెంటర్ ను ఎమ్మెల్యే సందర్శించి స్కూల్లో ఉన్న సమస్యలపై పిల్లలని టీచర్స్ ను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన,టీడీపీ,బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.