జన హృదయ నేతకు శుభాకాంక్షలు.. కనమేని
ముస్తాబాద్ 18 సెప్టెంబర్ (ప్రజా అక్షరం ఆర్సి ఇంచార్జ్)
ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రియతమైన నేత ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి జన్మదినం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు. ముస్తాబాద్ లో జన్మదిన వేడుకలు జరిపి వేములవాడలో వారి స్వగృహం నందు అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేశారు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.