టీ వై జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుని జన్మదిన వేడుకలు
జనం న్యూస్ సెప్టెంబర్ 28
మెదక్ జిల్లా లో ఘనంగా జరిగాయి
మెదక్ జిల్లా కౌడిపల్లి తునికి నల్ల పోచమ్మ ఆలయంలో టీ వై జె ఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తనుగుల జితేందర్ రావు ప్రత్యేక పూజలు అర్చనలు చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం డి రామానాయుడు వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ మరియు కేక్ కట్ చేయడం జరిగింది మరియు కౌడిపల్లి ప్రభుత్వహాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది వృద్ధులు మాట్లాడుతూ జితేంద్ర రావు సార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో చల్లగా ఉండాలని వారు దీవెనలు అందించారు ఈ కార్యక్రమంలో టి వై జె ఎఫ్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగరాజు చారి టీ వై జె ఎఫ్ రాష్ట్ర నాయకులు రవికుమార్ గౌడ్ కొల్చారం మండలం అధ్యక్షుడు శ్రీశైలం సభ్యులు మధు ఆకుల యాదగిరి రవి భరత్ గౌడ్ రమేష్ లింగంతదితరులు పాల్గొన్నారు