ఈనెల 15న శివ్వంపేట శ్రీబగలాముఖీ శక్తిపీఠంలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు.
ఉదయం 10 గంటలకు శక్తిపీఠం మహాద్వారం ప్రారంభోత్సవ వేడుకలు
అమ్మవారి ఉపాసకులు, బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో కొనసాగనున్న జ్వాలా తోరణం....
కార్తీక దీపోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న బగలాముఖీ ట్రస్ట్..
జిల్లాలోని అమ్మవారి భక్తులందరూ కూడ తప్పకుండ హాజరు కావాలని ఆహ్వానం....
జనం న్యూస్ నవంబర్13.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ దేశంలోనే అత్యంత శక్తిపీఠాలలో ఒకటైన మెదక్ జిల్లా శివ్వంపేట శ్రీబగలాముఖీ శక్తిపీఠంలో ఈనెల 15న శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు బగలాముఖీ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నిరకాలుగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు అమ్మవారి ఉపాసకులు, బగలాముఖీ ట్రస్ట్ చైర్మన్ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బగలాముఖీ ట్రస్ట్ సభ్యులు, హైకోర్టు న్యాయవాది జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్, మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త,దర్శనం వెంకన్న శర్మ, శాస్త్రుల పురుషోత్తం శర్మ,మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ సహాయ, సహకారాలతో అమ్మవారికి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలతో పాటు, కార్తీక దీపోత్సవంతో పాటు ఇదే రోజు సాయంత్రం అతి పవిత్రమైన బగలాముఖీ జ్వాలా తోరణం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించడం జరుగుతుందని వెంకటేశ్వర శర్మ తెలిపారు. అమ్మవారి ప్రత్యేక పూజలకు జిల్లాలోని అమ్మవారి భక్తులందరూ కూడ అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.@@@ బగలాముఖీ శక్తిపీఠం మహాద్వారం ప్రారంభహోత్సవం.. @@@తన తండ్రి స్వర్గీయ ఉదండపురం శంకర్ గౌడ్ స్మారకార్థం ఆయన భార్య ఉదండపురం పద్మ, ఆమె కుటుంబ సభ్యులు తమ స్వంత డబ్బులు 10 లక్షల రూపాయలతో శ్రీబగలాముఖీ శక్తిపీఠం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీబగలాముఖీ అమ్మవారి మహాద్వారం ప్రారంభత్సవ వేడుకలు ఈనెల 15న ఉదయం 10 గంటలకు బగలాముఖీ ట్రస్ట్ చైర్మన్, అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ తెలిపారు. ప్రారంభోత్సవ వేడుకలకు భక్తులందరూ పాల్గొనాలని సూచించారు.