తడ్కల్ షేక్టర్ పరిదిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన డిపిఎం డాక్టర్ మల్లేశం

తడ్కల్ షేక్టర్  పరిదిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన డిపిఎం డాక్టర్ మల్లేశం

సానరకపు వరి ధాన్యం కొనుగోలు చెయ్యరా?

అధికారులను నిలదీసిన రైతన్నలు

జనం న్యూస్,నవంబర్ 12,కంగ్టి 

 సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ పరిసరాల గ్రాలలోని ముర్కుంజల్, డొగ్ బాన్సువాడ,పీఎం దామరగిద్ద,జంమ్గి బి, జంమ్గి కె,ఘణపూర్, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం డిపిఎం డాక్టర్ మల్లేశం, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా డిపిఎం  కొనుగోలు కేంద్రలలోని పలు రికార్డులను పరిశీలించి వరి ధాన్యం తేమాశాతాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వరి ధాన్యాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, వెనువెంటనే తూకం నిర్వహించి రైస్ మిల్స్ కి తరలించాలని సీసీలకు ఆదేశించారు.సన్న రకం వరి ధాన్యం పండించిన రైతన్నలు డిపిఎం ను వారి ధాన్యాన్ని కొనుగోలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని రైతన్నలు డిమాండ్ చేశారు.కొనుగోలు చేయని యెడల కొనుగోలు కేంద్రంలో తూకాన్ని నిలిపివేసి, ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కిష్టయ్య, ఏఈఓ హనుమండ్లు,సీసీలు రేణుక,సంతోష్,అనసూయ్యా,కల్లప్ప,ఐకెపి సిబ్బంది సుమా దేవి, సవిత,సావిత్రి,రైతులు రెడ్డి కిష్టన్న,రెడ్డి నారాయణ,రెడ్డి సదేవ్,తొమ్రే బాలప్ప, బన్సీ నాయక్,  తదితరులు పాల్గొన్నారు.