దేవాదాయ శాఖను రద్దుచేసి దేవాలయాలను సనాతన ధర్మకర్తలను అప్పగించాలి*

దేవాదాయ శాఖను రద్దుచేసి దేవాలయాలను సనాతన ధర్మకర్తలను అప్పగించాలి*

*హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కంగ్టి తాసిల్దార్ విష్ణు సాగర్,ను వినతి పత్రం అందజేత*

జనం న్యూస్,సెప్టెంబర్ 26,కంగ్టి   

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం సమితి పెద్దలతో తాసిల్దార్ విష్ణు సాగర్,ను దేవాదాయ శాఖను రద్దు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిందూ దేవాలయాలను పరి రక్షించేందుకు దేవాదాయ శాఖను రద్దుచేసి సాధుసంతులకు, హైందవ సనాతన ధర్మకర్తలకు, అప్పగించాలని హైందవ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ముక్తకంఠంతో తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. హైందవ ఆలయాల భూముల,ఆదాయాన్ని సాధుసంతమాత్ములకు, హైందవ సనాతన ధర్మకర్తలకు,మాత్రమే అప్పగించాలని డిమాండ్ చేశారు. హైందవ దేవాలయాలలో అన్యమతస్తులకు స్థానం కల్పించకూడదని డిమాండ్ చేశారు. గోవుల వదలను సమూలంగా నిర్మూలించే చట్టాలను కఠిన తరంగా అమలు చేయాలని గోవులను వహించే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భూ వైకుంఠమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల జరిగిన లడ్డు ప్రసాదంలో అపవిత్రతకు పాల్పడిన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సాయిరాం,ఆకుల రాజు, కాపార్టీ ఆంజనేయులు, గుర్రపు సత్యనారాయణ, కోటగిరి మనోహర్, రమేష్ గౌడ్,కమ్మరి నరేందర్,దత్తు రావు పాటిల్,రెడ్డి మహేష్, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు,