త్వరలో 2000 రూపాయల నోట్లు రద్దు.. త్వరపడండి.. సీన్ కట్ చేస్తే...?
జనం న్యూస్: త్వరలో 2 వేల రూపాయల నోట్లు రద్దు… త్వరపడండి.. అంటూ మోసం చేస్తున్న గ్యాంగ్ ని పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. అమాయకులను టార్గెట్ చేస్తూ.. కోటి 90 లక్షలు దోచుకుంది ఈ ముఠా. శ్రీకాళహస్తికి చెందిన షేక్ రోషన్ మహబూబ్, నార్సింగ్ కి చెందిన కొలంపల్లి శ్రీనివాస్, ఉప్పల్ కి చెందిన బింగి వాసు, ఎల్బీ నగర్ కి చెందిన సింగం శెట్టి రాములు లను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. మీ దగ్గరున్న 2 వేల నోటు ఇస్తే.. 20 శాతం అదనంగా 500 నోట్లు ఇస్తామని మోసాలకు పాల్పడ్డారు. లక్ష రూపాయల 2 వేల నోట్లు ఇస్తే.. లక్షా 20 వేల విలువైన 500 నోట్లు ఇస్తామని వ్యాపారులను నమ్మించి మోసాలకు పాల్పడ్డారు ఈ ముఠా సభ్యులు. పలువురు వ్యాపారుల నుంచి 2 వేల నోట్ల రూపంలో కోట్ల రూపాయలు దండుకుని పరార్ అవ్వాలని ఈ ముఠా ప్లాన్ చేశారు. పక్కా సమాచారం మేరకు ఈ ముఠాని పట్టుకుని కోటి 90 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.