నెల్లిమర్ల మద్యం గోడౌన్‌ వద్ద వైన్‌ షాప్‌ ఉద్యోగుల ఆందోళన 

నెల్లిమర్ల మద్యం గోడౌన్‌ వద్ద వైన్‌ షాప్‌ ఉద్యోగుల ఆందోళన 

జనం న్యూస్ 25 సెప్టెంబర్

విజయనగరం టౌన్ రిపోర్టర్

గోపికృష్ణ పట్నాయక్

జిల్లావ్యాప్తంగా వైన్‌ షాపుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు స్థానిక ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌ గోడౌన్‌ వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు.

అసిస్టెంట్‌ మేనేజర్‌ కు వినతిపత్రం అందజేశారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్సయిజ్‌ సీఐ శ్రీనివాస్‌, నెల్లిమర్ల ఎస్సై గణేష్‌, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.