పద్మశాలి సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బొమ్మిరాల పద్మనాభం....
జనం న్యూస్ డిసెంబర్18.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన బొమ్మిరాల పద్మనాభం మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్ అధ్యక్షతన హైదరాబాద్ లోని హరిహర కళభవన్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పద్మనాభంకు నియామక పత్రం అందిచడం జరిగింది.ఈసందర్బంగా పద్మనాభం మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్, జిల్లా అధ్యక్షులు మ్యాకల జయరాములుకు,నా నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. పద్మశాలి కులస్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటు వారి సమస్యలు పరిష్కరిస్థానని, వారికి ప్రభుత్వం నుండి రావలసిన అన్ని సంక్షేమ పథకాలను అందేవిదంగా కృషి చేస్తానని తెలిపారు.