మాల మహానాడు సింహ గర్జనకు తరలి వెళ్లిన మాల నాయకులు
మాల మహానాడు డివిజన్ ఉపాధ్యక్షులు ముత్యాల సాయిలు, మండల అధ్యక్షులు కొత్త గైని సాయిలు,
జనం న్యూస్,డిసెంబర్ 01,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని తడ్కల్ గ్రామం పరిధిలోని పరిసరాల గ్రామాల మాల నాయకులు ఆదివారం తడ్కల్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి మాల మహానాడు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల పరిధిలోని మాల సోదరులు వెనకబాటుకు కారణమైనారని అన్నారు.మాల సహోదరులకు తోటి సహోదరులుగా, కుటుంబ సభ్యులుగా, సోదర భావాన్ని పెంపొందిస్తూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వపరంగా కానీ,సమాజపరంగా కానీ,ఎటువంటి అవంతరాలను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ముందుండి పరిష్కరించే దిశగా ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తానని అన్నారు.నేటి మాల మహానాడు సింహ గర్జనకు మా హక్కులను సాధించుకునే కొరకై మాల మహానాడు మహా సింహ గర్జనకు తరలి వెళుతున్నామని అన్నారు.మాలలకు లభించే హక్కులను హరింపజేయాలన్న దానిపై ఈరోజు సింహ గర్జనతో మొదలవుతున్న మహా ఉద్యమం అని అన్నారు. మాలల హక్కులను సాధించేంతవరకు విశ్రమించకుండా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఖేడ్ డివిజన్ మాల మహానాడు అధ్యక్షులు విశ్వనాథ్,ఉపాధ్యక్షలు ముత్యాల సాయిలు, డివిజన్ సెక్రెటరీ గైనిమారుతి,కంగ్టి మండల మాల మాలమహానాడు అధ్యక్షులు కొత్తగైని సాయిలు,అధ్యక్షులు సిద్దిరాం,తడ్కల్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు భూమయ్య, మాల పెద్దలు జైపాల్, మంచేందర్,శ్రీపతి,
మాల సహోదరులు పాల్గొన్నారు.