పేకాటలు నిర్వహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు
- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 16 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం పట్టణం ఎన్.వి.ఎన్.నగర్ లోని సుజాత ఫంక్షను హాలు నందు నవంబర్ 14న పేకాట ఆడుతన్న వారిపై, విజయనగరం డిఎస్పీ ఆధ్వర్యంలో రైడ్ నిర్వహించి, పేకాట నిర్వాహకులతోపాటు, పేకాట ఆడుతున్న 42మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ. 17,34,190/-ల నగదు, 49 సెల్ ఫోన్లు, రెండు కార్లు, రెండు మోటారు సైకిళ్ళు, గదులను అద్దెకు తీసుకున్నట్లుగా అగ్రిమెంటు కాపీని సీజ్ చేసామని జిల్లా పోలీసు కార్యాలయంలో నవంబరు 15న నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - జిల్లాలో ఎక్కడా ఆర్గనైజ్డ్ గా పేకాట జరగకూడదని, ఎవరైనా పేకాట నిర్వహిస్తూ, పట్టుబడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. విజయనగరం పట్టణం ఎస్.వి.ఎస్.నగర్ లోని సుజాత ఫంక్షను హాలులో కొంతమంది వ్యక్తులు గదులను అద్దెకు తీసుకొని, పేకాట నిర్వహిస్తున్నట్లుగా నవంబరు 14న పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు, ఎస్ఐ కృష్ణమూర్తి మరియు ఇతర పోలీసు బృందంతో రైడ్ చేసి, పేకాట నిర్వహిస్తున్న పూసపాటిరేగకు చెందిన కాకర్లపూడి కృష్ణమూర్తి రాజుతో సహా పేకాట ఆడుతున్న మరో 41 మందిని అరెస్టు చేసామన్నారు. పేకాటలో పట్టుబడిన వారి వద్దe నుండి రూ.17,34,190/-ల నగదు, 49 సెల్ ఫోన్లు, రెండు కార్లు, రెండు మోటారు సైకిళ్ళును, ఫంక్షను హాలులో గదులను అద్దెకు తీసుకున్నట్లుగా అగ్రిమెంటు కాపీని సీజ్ చేసామన్నారు. పేకాటలో పట్టుబడిన వారిలో విజయనగరం జిల్లాకు చెందిన వారు 15మంది, శ్రీకాకుళం జిల్లాకు చెందిన 6గురు, విశాఖపట్నంకు చెందిన వారు 9మంది, అనకాపల్లి జిల్లాకు చెందిన వారు 11 మంది, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వారు ఒకరు ఉన్నారన్నారు. వీరిలో 14మంది ఇప్పటికే వివిధ పోలీసు స్టేషను పరిధిలో పేకాట ఆడుతూ, పలుమార్లు పట్టుబడినట్లుగా కేసులు ఉన్నాయన్నారు. తరుచూ పేకాట ఆడుతున్న వారిపై షీట్లు తెరుస్తామన్నారు. పేకాట నిర్వహించుటలో ఫంక్షను హాలు నిర్వాహకుల పాత్రపై కూడా విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.పేకాట రైడ్ నిర్వహణలోను, ముందస్తు సమాచారంను సేకరించుటలో క్రియాశీలక పాత్ర పోషించిన విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు, ఎస్ఐ ఎం.కృష్ణమూర్తి, ఎఎస్ఐ బి. గౌరి నాయుడు మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, సిఐలు టి.శ్రీనివాసరావు, ఎవి లీలారావు, ఆర్.వి.ఆర్.కే. చౌదరి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.