ఆదర్శ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయిలో ఎంపిక

ఆదర్శ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయిలో ఎంపిక

జనం న్యూస్ సెప్టెంబర్ 22 కాట్రేను కొన
డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ - స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారు నిర్వహించుచున్న ఆట పోటీల్లో మండల స్థాయిలో ఎంపికయ్యి నేడు జగ్గంపేట నియోజకవర్గం స్థాయి ఆటల పోటీలు రాజపూడి గవర్నమెంట్ హై స్కూల్ ప్రాంగణంలో జరుగుతున్న ఆటలలో  ఆదర్శ హై స్కూల్ విద్యార్థిలు 8 మంది పాల్గొనడం జరిగిందని హెచ్ఎం హత్య నారాయణ తెలియజేశారు. ఈ పోటీల్లో ఆదర్శ హై స్కూల్ విద్యార్థులు నలుగురు జిల్లా స్థాయికి ఎంపిక అయినారని బ్యాట్మెంటన్  అండర్ 14 విభాగంలో దుర్గాప్రసాద్, అండర్ 17 విభాగంలో రాజకుమార్, చదరంగం అండర్ 14 విభాగంలో భరత్ చంద్ర మరియు కబాడీ అండర్ 17 విభాగంలో ప్రవీణ్ అనే విద్యార్థులు ఎంపికైనరని పి ఈ టి రవి తెలియజేశారు. హెచ్ఎం సత్యనారాయణ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఆటల పోటీల నందు మా విద్యార్థులను తర్ఫీదు చేయిస్తున్నామని దాని ఫలితం నేడు జిల్లా స్థాయిలో ఎంపికైన నలుగురు విద్యార్థులని ఇది మా స్కూలు యొక్క గర్వకారణమని తెలియజేశారు. ఈ సందర్భంగా సెక్రటరీ నాగమణి మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో అత్యధిక మార్కులు ఆదర్శ హై స్కూల్ విద్యార్థికి రావడం జరిగిందని చదువుతోపాటు ఆట పోటీల్లో ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నామని దీనికి ఉదాహరణ ఈరోజు నలుగురు విద్యార్థులు జిల్లా స్థాయిలో ఎంపిక అవ్వటం జరిగిందని సంతోషంతో తెలియజేశారు. చైర్మన్ కనకరాజు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ వీరు రాష్ట్రస్థాయిలో ఎంపిక అవ్వాలని దానికి కావలసిన వనరులు సమకూరుస్తామని తెలియజేశారు. ఎంపికైన విద్యార్థులు ఆదర్శ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ త్రినాధరావు వైస్ ప్రిన్సిపాల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఆదర్శ హై స్కూల్ అధ్యాపక బృందం అభినందనలు తెలియజేశారు