ప్రచురణార్థం ప్రసారార్థం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ)
విజయనగరం పట్టణ కమిటీ
జనం న్యూస్ 22 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విశాఖలో లా విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి.
బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన కార్యక్రమం
జనం న్యూస్ 22 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విజయనగరం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచార ఘటనలను నివారించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. స్థానిక విజయనగరం కాంప్లెక్స్ వద్ద విద్యార్థులు సాయంత్రం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కోకన్వీనర్ భారతి మాట్లాడుతూ రోజురోజుకు రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పేరుకుపోతున్నాయని నిన్నటికి నిన్న విశాఖలో లా విద్యార్ధిని ప్రేమ పేరుతో వంచించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వీటికి కారణమైన డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలను రాష్ట్రంలో నిరోధించాలని ప్రభుత్వం ఆ దిశగా యుద్ధపాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అత్యాచారానికి గురికాబడ్డ లా విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యార్థులపై మహిళలపై ఆకృత్యాలు జరుగుతూనే ఉన్నాయని వీటిని నివారించాల్సిన ప్రభుత్వం రాజకీయాలే కాలయాపనగా ప్రవర్తిస్తుందని విమర్శించారు. తక్షణమే రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతిభద్రతలను కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు. అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని , లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు అందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి రాము, జిల్లా ఉపాధ్యక్షులు జ్. రవికుమార్,జిల్లా సహాయ కార్యదర్శి పి రమేష్, శిరీష నాయకులు సోమేశ్, రాజు ,రాహుల్ ,కుమార్ స్వామి ,మురళి తదితరులు పాల్గొన్నారు.