జిల్లా పోలీసుశాఖలో పారదర్శకంగా బదిలీలు

జిల్లా పోలీసుశాఖలో పారదర్శకంగా బదిలీలు

- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్.
జనం న్యూస్ 22 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో వివిధ హెూదాల్లో పని చేస్తూ, ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ నవంబరు 21న జిల్లా పోలీసు కార్యాలయంలో కౌన్సిలింగు నిర్వహించి, పారదర్శకంగా బదిలీలు ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - బదిలీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు కౌన్సిలింగు నిర్వహించినట్లుగా తెలిపారు. కౌన్సిలింగుకు వివిధ పోలీసు స్టేషన్లులో పని చేస్తూ, ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన పోలీసు సిబ్బందిని కౌన్సిలింగు ప్రక్రియ ద్వారా బదిలీలు చేసేందుకుగాను జిల్లా పోలీసు కార్యాలయంకు పిలిపించామన్నారు. బదిలీల కౌన్సిలింగుకు హాజరైన పోలీసు సిబ్బంది పుట్టిన తేదీ, సీనియారిటీ ప్రాతిపదికగా ఒకలిస్టును తయారు చేసి, పోలీసు కార్యాలయంలో కంప్యూటరు స్క్రీన్ మీద ప్రదర్శించామన్నారు. బదిలీల కౌన్సిలింగుకు హాజరైన వారిని సమావేశ మందిరంలో కూర్చుండబెట్టి, ఒక్కొక్కరిగా ఎఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళును కౌన్సిలింగుకు పిలిచామన్నారు. వివిధ పోలీసు స్టేషన్లులో ఏర్పడిన ఖాళీలను కంప్యూటరు స్క్రీన్ మీద ప్రదర్శించి, వారి నుండి విన్నపాలను స్వీకరించి, వారు కోరుకున్న స్థానానికి పారదర్శకంగా బదిలీలను చేపట్టామని జిల్లా ఎస్పీ అన్నారు. 17మంది ఎఎస్ఐలు, 59 హెడ్ కానిస్టేబుళ్ళు, 137మంది కానిస్టేబుళ్ళుకు జిల్లా ఎస్పీ వివిధ పోలీసు స్టేషన్లుకు బదిలీలు చేస్తూ, ఉత్తర్వులు జారీ చేసారు. ఎటువంటి సిఫార్సులకు తావు లేకుండా క్రింది స్థాయి సిబ్బంది కోరుకున్న స్థానానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ బదిలీలు చేపట్టడంతో పోలీసు సిబ్బంది తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఈ బదిలీల ప్రక్రియలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఓ పి.శ్రీనివాసరావు, ఆఫీసు పర్యవేక్షకులు వెంకటలక్ష్మి, ఎస్బీ సిఐలు ఎవి లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, చాముండేశ్వరి మరియు ఇతర పోలీసు అధికారులు, కంప్యూటరు సిబ్బంది పాల్గొన్నారు.