ప్రత్యేక గృహ నిర్మాణ పధకం: కలెక్టర్ అంబేడ్కర్
జనం న్యూస్ 22 సెప్టెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లాలో మంజూరైన గృహలన్నిటినీ పూర్తి చేయడానికి మన ఇల్లు- మన గౌరవం పేరుతో ప్రభుత్వం ప్రత్యేక గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. శనివారం ఆయన ఛాంబర్ నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 28 న అన్ని గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు.