ప్రముఖనటి జైలుకి...! అసలేం జరిగిందో తేసుసా..?
జనం న్యూస్: వేగంగా కారునడిపి ఒకరి మృతికి కారణమైన కేసులో ప్రముఖ కోలీవుడ్ నటి యాషికా ఆనంద్‌కు కోర్టు గురువారంఅరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రెండేళ్ల క్రితం జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని తమిళనాడులోని చెంగల్‌పట్టు కోర్టు పీడీ వారెంట్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో నటి యాషిక విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా 2021లో జులై 25న మహాబలిపురం నుంచి చెన్నైకి తిరిగి వస్తుండగా ఈసీఆర్‌లోని సులేరికాడు సమీపంలో రాత్రి 11.30 గంటల ప్రాంతంలో యాషిక ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో యాషిక కాలు ఫ్రాక్చర్ కాగా, ఆమె స్నేహితురాలు వల్లి చెట్టి భవాని (28) అక్కడికక్కడే మృతి చెందింది.
ప్రమాదం జరిగిన సమయంలో యాషిక వాహనం నడిపింది. ఐపీసీ సెక్షన్ 304 ఎ సహా 3 సెక్షన్ల కింద నటిపై కేసు నమోదైంది. ఈ కేసులో మార్చి 21న వ్యక్తిగతంగా హాజరుకావాలని చెంగల్‌పట్టు కోర్టు ఆదేశించింది. నటి హాజరు కాకపోవడంతో తదుపరి విచారణకైనా వచ్చే నెల (ఏప్రిల్) 21న హాజరుకావాలని, ఆ రోజు కూడా హాజరు కాకపోతే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఈసారి కూడా యాషిక కోర్టు విచారణకు హాజరుకాకపోతే పోలీసులు ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉంది.