మధ్యాహ్న భోజన పథకం నిధులను విడుదల చేయాలి, మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్

మధ్యాహ్న భోజన పథకం నిధులను విడుదల చేయాలి, మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్

మధ్యాహ్న భోజనం పథకం నిధులు విడుదల కాక, అప్పుల బాధతో సత మతం అవుతున్న వంట కార్మికులు, పట్టించుకోని అధికారులు.

జనం న్యూస్,నవంబర్ 06,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న  మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు  మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న,వంట కార్మికుల నిధులను విడుదల చేయాలని, బుధవారం వంట కార్మికులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వంట కార్మికులు మాట్లాడుతూ గత సంవత్సరం మధ్యాహ్న భోజన పథకం నిధులతో  పాటు,పదవ తరగతి   విద్యార్థిని విద్యార్థులకు  ప్రోద్దున అల్పాహారం, సాయంత్రం అత్యల్పహరని  అందించిన నిధులను  నేటి వరకు నిధులను   చెల్లించకపోవడంతో   కిరాణా కొట్టు,అరటి   పళ్ళ కొట్టు,కూరగాయల కొట్టు,యజమానులు  తమ వద్ద నుంచి  తీసుకువెళ్లిన సరుకుల  డబ్బులను చెల్లించాలని  తీవ్ర ఇబ్బందులను గురి చెయ్యడంతో,వారి ఇబ్బందులను తట్టుకోలేక తమ వద్ద  ఉన్న బంగారు  ఆభరణాలను తాకట్టు   పెట్టి,అమ్మి వేసి,  అప్పులను తీర్చడం జరిగిందని అన్నారు.  ఇంతటి దుర్భరమైన  పరిస్థితి ఇలాగే   కొనసాగితే మధ్యాహ్న  భోజనం పథకం వండి  పెట్టే స్థితిగతులు  ఉండవని అన్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వ  అధికారులు వెంటనే  స్పందించి మధ్యాహ్న  భోజన పథకం నిధుల మంజూరులో చొరవ  తీసుకొని తగు చర్యలు  తీసుకోవాలని డిమాండ్  చేశారు.ఈ కార్యక్రమంలో ఎలుట్ల     రామవ్వ,ఎలుట్ల    లింగామణి,రెడ్డి   లచ్చవ్వ,మాటిక్యా  గంగామణి,ధర్పల్లి  సావిత్రి,పాల్గొన్నారు.