మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
జనం న్యూస్ 2-10-24 అందోల్ నియోజకవర్గం-జిల్లా సంగారెడ్డి గాంధీ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జోగిపేట పట్టణంలో ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులతో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సురేందర్ గౌడ్, చిట్టిబాబు, రంగ సురేష్ ,పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల ప్రవీణ్ కుమార్, చిట్యాల మధు, శేఖర్, మురళి, గుర్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.