మహిళను వివస్త్రను చేసి సర్జరీ చేసిన వార్డ్ బాయ్. ఆ పై వీడియోను వాట్సాప్లో (వీడియో చూడండి)

జనం న్యూస్: ప్రైవేట్ ఆసుపత్రిలోని వార్డు బాయ్ ఒక మహిళా రోగి దుస్తులు విప్పి సర్జరీ చేశాడు. ఈ వీడియోను రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇది వైరల్‌ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేయాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హార్దియాలోని బస్తీ కేర్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఐ సెంటర్‌లో అడ్మిట్‌ అయిన మహిళా రోగికి అక్కడి డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. వివస్త్రగా ఉన్న ఆమె సర్జరీకి వార్డు బాయ్‌ సహకరించాడు. దీనిని రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఈ సంఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, ఆ ప్రైవేట్ ఆసుపత్రి డైరెక్టర్ సంజయ్ కుమార్ సూచనల మేరకు మహిళా రోగికి సర్జరీ చేసినట్లు వార్డు బాయ్‌ ఆరోపించాడు. అయితే దీని గురించి తనకు తెలియదని ఆ డైరెక్టర్‌ తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసి ఆ వార్డు బాయ్‌పై చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు ఈ సంఘటనపై దర్యాప్తు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దోషులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించింది. అయితే దీని గురించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.