ముకుంద తాండ లో సర్వే సరళిని పరిశీలించిన ఎంపీడీవో సత్తయ్య,
జనం న్యూస్, నవంబర్ 12,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ముకుంద తాండలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వే సరళిని మంగళవారం ఎంపీడీవో సత్తయ్య, పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ నేటి వరకు రెండు ఎన్నుమరేషన్ బ్లాక్లకు కలిపి 60 ఒక్క సర్వే ఫామ్స్ ఇవ్వడం జరిగింది.60 ఒక్క కుటుంబాల సర్వే పూర్తయిందని అన్నారు. అనంతరం గ్రామంలోని పాఠశాలను సందర్శించి అధ్యాపకుల వివరాలను పరిశీలించారు.కొత్తగా ఇద్దరు అధ్యాపకులకు పాఠశాలకు నియమితులయ్యారని అన్నారు.పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు చక్కటి బోధనలను బోధిస్తున్నారా అని విద్యార్థి విద్యార్థులకు, అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని త్రాగునీటి సరఫరా, శానిటేషన్, అమలవుతున్న తీరును గ్రామస్తులతో చర్చించి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన పలు సమస్యలను పరిష్కరించే దిశగా నీటి సరఫరా,పైప్ లైన్ లీకేజ్ ని ఎప్పటికప్పుడు చూసుకొని తగు చర్యలు చేపట్టాలని కార్యదర్శికి ఆదేశించారు.అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. సందర్శనలో భాగంగా గ్రామంలోని శంకర్ అనే వృద్ధాప్య వికలాంగుడు తనకు పెన్షన్ మంజూరు చేయించాలని ఎంపీడీవోను కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సర్దార్ నాయక్,పంచాయతీ కార్యదర్శి రమేష్, ఉపాధ్యాయినిలు రేణుక,అన్నపూర్ణ, అంగన్వాడి టీచర్ లలిత,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.