ముఖ్య నేతల అరెస్ట్‌కు ముహూర్తం ఫిక్స్ - రేవంత్ హిట్ లిస్టులో..!!
జనం న్యూస్ 26 అక్టోబర్ 2024 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులంబ గద్వాల్ డిస్ట్రిక్ట్
తెలంగాణ రాజకీయంలో కొత్త కలకలం. బీఆర్ఎస్ నేతల పై రేవంత్ సర్కార్ గురి. కీలక నేతల అరెస్ట్ లు ఉంటాయంటూ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం. తాజాగా మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది.
గత ప్రభుత్వ హాయంలో జరిగిన అక్రమాల పైన పూర్తి ఆధారాలతో బాధ్యుల పైన చర్యలు ఉంటాయని ప్రభుత్వంలోని కీలక నేతలు చెబుతున్నారు. ఇందుకు ముహూర్తం సైతం ఫిక్స్ చేసారు. దీంతో, ఇప్పుడు సీఎం రేవంత్ హిట్ లిస్టులో ఉన్నదెవరు. ఏం జరగబోతోంది.
అరెస్ట్ లు ఖాయమంటూ
తెలంగాణలో సంచలన రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బీఆర్‌ఎస్ ముఖ్యుల అక్రమాలపై ఫైళ్లు సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ లిస్టులో నాటి ప్రభుత్వంలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ తొలి వారంలో వరుస పరిణామాలు ఉంటాయని ముఖ్య నేతలు లీకులు ఇస్తున్నారు. దీంతో, ప్రస్తుతం గులాబీ పార్టీలో టెన్షన్ మొదలైంది. మంత్రి పొంగులేటి త్వరలోనే బాంబులు పేలతాయంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. అన్నింటికీ పక్కా ఆధారాలున్నాయని, ఎవరినీ వదిలిపెట్టబోమని మంత్రి స్పష్టం చేసారు. దీంతో, గత ప్రభుత్వం పై సీఎం రేవంత్ గతంలో చేసిన ఆరోపణలు.. అంశాల పైన చర్చ మొదలైంది.ఈ అంశాలపైనే ఫోకస్ గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. ఫోన్‌ట్యాపింగ్, ధరణి, భూ అక్రమాల పైన కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసారు. వీటిలో కుంభకోణాలు జరిగాయని రేవంత్ తో సహా పార్టీ నేతలు ఆరోపించారు. దీనికి సంబంధించి అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అక్రమార్కులను ఎలా శిక్షించాలన్నది చట్టం చూసుకుంటుందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. కుంభకోణాలు, అవినీతిలోని ఆస్తుల రికవరీని కూడా చట్టమే చూసుకుంటుందని చెప్పుకొచ్చారు. దీంతో, కాంగ్రెస్ ఆరోపణలు చేసిన అంశాల్లో ఎవరి పాత్ర ఉంది.. పొంగులేటి చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత అనేది బీఆర్ఎస్ నేతలు ఆరా తీస్తున్నారు.పెరుగుతున్న ఉత్కంఠ చట్టాలు ఉల్లంఘించి చేసిన పనుల రికార్డులను సిద్ధం చేశామని.. రెండు రోజుల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారని మంత్రి మరింత ఉత్కంఠ పెంచారు. ఎవరూ తప్పించుకోకుండా పక్కా ఆధారాలతో ముందుకెళ్తున్నామని వెల్లడించారు. ధరణి-భూముల అక్రమాలకు సంబంధించిన అంశాలనే వెలుగులోకి తెచ్చి కేసులు పెడతారని చెబుతున్నారు. ధరణి వ్యవహారాలను ఒక ప్రైవేటు సంస్థ టెరాసిస్‌కు ఇచ్చి, దాన్ని అడ్డు పెట్టుకుని కూడా కొన్ని లావాదేవీలు అక్రమంగా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, ప్రభుత్వం నుంచి తీసుకునే నిర్ణయాల పైన బీఆర్ఎస్ క్యాంపులో ఉత్కంఠ పెంచుతోంది.