యువత మాదకద్రవ్యాల జోలికే వెళ్లొద్దు ఎస్ఐ దాసరి మహిపాల్ రెడ్డి
చెడు వ్యసనాలకు యువత బానిసలు కావొద్దని శివంపేట ఎస్ ఐ సూచన..
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హితువు..
వినాయక నవరాత్రులను తొమ్మిది రోజులు ప్రశాంతంగా జరుపుకోవాలని శివంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి..
జనం న్యూస్ సెప్టెంబర్4.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్
నవ సమాజ నిర్మాణంలో యువతనే ముందుండాలని, అలాంటి యువత మాదకద్రవ్యాల జోలికి వెళ్లోద్దని శివంపేట ఎస్ఐ దాసరి మహిపాల్ రెడ్డి అన్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల కేందర్రమైన శివ్వంపేటలోని జేకే పంక్షన్ హలులో బుధవారం మాదకద్రవ్యాల నిర్ములన,సైబర్ మోసాలపై అప్రమత్తత, వినాయక నవరాత్రుల కోసం శాంతి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈసమావేశంలో శివంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో ఎవరైనా గంజాయి, హుక్కా, డ్రగ్స్ కొనుగోలు చేసిన, అమ్మిన పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్ములన కోసం ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ కంట్రోల్ రూంలో టీఎస్ నాబ్ వెబ్ సెబ్ ఓపెన్ చేయడం జరిగినదని, ప్రతి జిల్లాకో ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తోందని ఆయన అన్నారు. సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాలకు ప్రజలు దూరంగా ఉండాలని బ్యాకింగ్, ఓటీపీ వివరాలు అపరిచిత వ్యక్తులతో పంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. @@@ వినాయక నవరాత్రులను ఆనందంగా జరుపుకోవాలి.. @@@
త్వరలో నిర్వహించబోయే వినాయక నవరాత్రులను భక్తి శ్రద్దలతో, గౌరవప్రదంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని శివంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వినాయక మంటపాల వద్ద భక్తి పాటలు మాత్రమే పెట్టాలని, సినిమా పాటలు ఇతరత్ర ఏవైనా వినిపిస్తే మాత్రం ఖచ్చితంగా మైక్ లను అక్కడి నుండి తొలగింపజెయిస్తామని ఎస్ఐ మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. మంటపాల నిర్వహణకు అనుమతుల కోసం ఆన్ లైన్ లో అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. నవరాత్రులు అంటే 9 రోజుల పాటు జరుపుకునే ఒక భక్తి పండగని, 9 రోజులకే గణేష్ నిమజ్జనం చేయాలని, తొమ్మిది రోజుల తర్వాత ఉంటే పోలీస్ సిబ్బంది అక్కడికి వచ్చి వినాయకులను తరలించాల్సి వస్తుందని ఆయన సూచించారు. నిమజ్జనం రోజున తగిన జాగ్రత్తలు పాటించాలని, ఎట్టి పరిస్థితులలో మాత్రం డీజేకు అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ దేవదాసు, కానిస్టేబుల్ జానీ, రాజు, గోపాల్, ఆనంద్, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.