లోక అదాలత్ లో 175 కేసులు పరిష్కారం
జనం న్యూస్ సెప్టెంబర్ 15 కాట్రేనికోన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంముమ్మిడివరం మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ మహమ్మద్ రహంతుల్లా వారి ఆధ్వర్యంలో శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా 175 కేసులు పరిష్కారమైనట్లు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ గారు పేర్కొన్నారు.వీటిలో ఈ పీ కేసులు మూడు, అమౌంట్ 1,80,000, ఎన్ ఐ యాక్ట్ కేసులు ఆరు అమౌంట్ నాలుగు లక్షల 35000, ఎం సి కేసు ఒకటి ఐపిసి సీసీలు 71 కేసులు అమౌంట్ 85000 బ్యాంక్ పి ఎల్ సి లు 24 కేసులు అమౌంట్ 10 లక్షల 17 వేల రూపాయలు బిఎస్ఎన్ఎల్ పి ఎల్ సి లు 8 కేసులు అమౌంట్ 4,405 రూపాయలు ఎస్ టి సి లు 62 కేసులు అమౌంట్ 87 వేల 470 మొత్తం 18, 8 875 రూపాయలు అపరాధ రుసుము వసూలు చేసినట్లుగా తెలియజేశారు. ఈ లోక అదాలత్లో ముమ్మిడివరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ దాసరి దాసరి సత్యనారాయణ ,గ్రంధి రామారావు , గుత్తుల శ్రీనివాసరావు , ఎం వెంకటరమణ టి నాగరాజు రావు , ఆర్ మల్లేశ్వరరావు ఆలీ హసన్ మట్టపర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.