వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీమతి రాగమయి దయానంద్
* రైతుకు ఇచ్చిన మాట తప్పని కాంగ్రెస్ ప్రభుత్వం.
* సన్న వడ్లకు 500 బోనస్.
* వడ్ల కొనుగోలులో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎమ్మెల్యే.
జనం న్యూస్ టుడే; కల్లూరు.
తెలంగాణ ప్రభుత్వం రైతుల కొరకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాన్ని క్యాబినెట్ సమావేశంలో సన్న వడ్లకు 500 బోనస్ ను ప్రకటించింది.కల్లూరు మండలo, పుల్లయ్య బంజర గ్రామం లో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి శాసనసభ సభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ హాజరయ్యారు. ముందుగా అప్పయ్య స్వామి వారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఒడ్లు కొనుగోలు కేంద్రాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి జరిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ .. సన్న రకం వరి ధాన్యం క్వింటాకు 500 రూపాయల బోనస్ ను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కొరకు ఇస్తుందని, ప్రతి ఒక్క రైతు కూడా ఐకెపి సెంటర్ లోనే వడ్లను విక్రయించి ప్రభుత్వం ఇచ్చే 500 బోనస్ ను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే రైతుల పండించిన పంటకు ఎలాంటి తరుగు తీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ స్థానిక అధికారులకు ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత గ్రేడ్1, గ్రేడ్ 2 నాసిరకమంటూ రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దంటూ ఏదైనా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు .కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతు రుణమాఫీ డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని మంత్రివర్యులు తెలిపారని ఈ సందర్భంగా అన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని ఇబ్బందులు ఏమైనా ఉంటే అధికారులను అడిగి తెలుసుకోవాలని రైతులను కోరారు.ఈ కార్యక్రమం లో కల్లూరు వ్యవసాయ మార్కెట్ మహిళా చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి , ఎమ్మార్వో పులి సాంబశివుడు, ఎంపీడీవో ,ప్రభుత్వ అధికారులు, ఏవో రూప, ఏపిఎం మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.