విజయవాడ ప్రాంతంలో వరదల నష్టపోయిన ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కార్మికులకు సరుకులు పంపిణీ
జనం న్యూస్ 08 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
తోటి ఉద్యోగులకు అండగా నిలిచిన ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు
ఏపీ పిటిడి (ఆర్టీసీ) ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా సెప్టెంబరు నెలలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదముంపు ప్రాంతాలకు గురైన ఆర్టీసీ ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులు దాదాపు 131 మందికి పైగా కార్మిక కుటుంబాలు నీటమునిగిన కారణంగా, ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీ అసోసియేషన్ రాష్ట్రకమిటి తరపున నిత్యవసర సరుకులు పంపిణీ సోమవారం ఆర్టీసి హౌస్ లో మినీకాన్పరెన్సు హాల్ లో ఏపియస్ ఆర్టిసి చైర్మన్ .కొనకళ్ల నారాయణరావు మరియు ఆర్టీసి వైస్ చైర్మన్ ముని రత్నం చేతులమీదుగా పంపిణి జరిగింది. ఆర్టిసి చైర్మన్ కొనకళ్లనారాయణరావు మాట్లాడుతూ ఆర్టీసిలో చిరు ఉద్యోగులు అయినప్పటికీ సాటి ఔట్ సోర్శింగు ఉద్యోగులను ఆదుకొనేందుకు తమవంతు సహాయసహకారాలు అందించాలన్న ఆలోచనచేసి 131 మందికి పైగా భాదితులకు సరుకుల పంపిణి చేయడం అభినందనీయమని తెలిపారు.అలాగే ఈకార్యక్రమంలో బాగంగా ఔట్ సోర్శింగు ఉద్యోగుల సమస్యలకు సంబందించిన మెమోరాండాన్ని ఔట్ సోర్శింగు ఉద్యోగుల అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తంగుడు ముత్యాలరావు,ప్రధానకార్యదర్శి కుమార్ నాయక్ ఆద్వర్యంలో చైర్మన్ కు అందజేసారు.ఇందులో ప్రధానంగా ఆర్టీసి లో పనిచేస్తున్న సుమారు 8000 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు, ఆ కాంట్రాక్ట్ పద్ధతిని రద్దుచేసి, అప్కాస్ లో చేర్పించేలా చూడాలని అంతవరకు ప్రస్తుతం కాంట్రాక్టులద్వారా చెల్లిస్తున్న జీతాలు సక్రమంగా చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈజీతాలు ఆర్టీసి మేనేజ్ మెంటే డైరెక్టుగా బ్యాంకు అకౌంటుద్వారా జీతాలు చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేసారు.ఈసందర్బంగా ఆర్టీసి చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు మాట్లాడుతూ ఔట్ సోర్శింగు ఉద్యోగులు సమస్యలు పరీష్కారంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లడమే కాకుండా సంస్ద పరంగా ఎంతవరకు సహాయపడగలమో అన్న విషయాలపై ఆర్టీసి యం.డి మరియు ఇతర ఉన్నతాధికార్లతో చర్చించి పరిష్కరించేందుకు తమ వంతు కృషిచేస్తామని హామిఇచ్చారు.ఈకార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ .బ్రహ్మనందరెడ్డి , రవివర్మ , చంద్ర శేఖర్ ఏపిపిటిడి (ఆర్టీసి)ఎంప్లాయుస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు తో పాటు,ఇ.యు నాయకులు యం.డి.ప్రసాధ్,నాగేశ్వరరావు,యం.డి.ప్రసాధ్,వై.శ్రీనివాసరావు ఇతర ఇ.యు రాష్ట్ర,జోన్ నాయకులు మరియు ఔట్ సోర్శింగు రాష్ట్రకమిటీ నాయకులు తంగుడు ముత్యాల రావు కుమార్ నాయక్ , అశోక్ సుధీర్ ,గజపతి, మధు గంగాంజనేయులు, వచ్చిన జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు పాల్గొన్నారు..