వ్యక్తిగత పరిశుభ్రతను తప్పక పాటించాలి

వ్యక్తిగత పరిశుభ్రతను తప్పక పాటించాలి

ఐసీడీఎస్ మండల సూపర్వైజర్ సంతోష....

 జనం న్యూస్ సెప్టెంబర్19.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతను ప్రతిఒక్కరు కూడ తప్పకుండ పాటించాలని ఐసీడీఎస్ శివంపేట  మండల సూపర్వైజర్ సంతోష  అన్నారు. మండలంలోని రెడ్య తండాలో గురువారం పోషణ మాసోత్సవంలో భాగంగా మహిళలు, పిల్లలకు చేతుల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా అంగన్వాడీ సూపర్వైసర్ సంతోష మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిఅని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడ పాటించాలని ఆమె అన్నారు. భోజనానికి ముందు, భోజనం తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలని, గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల కోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. మహిళలలో రక్తహీనత నివారణకు భోజనంతో పాటు పాలు, కోడిగుడ్లు, ఆకుకూరలు అధికంగా తీసుకోవాలని ఆమె సూచించారు.చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బాలమృతంను క్రమం తప్పకుండ తినిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రేణుక, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.