శాంతినగర్ లోని ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

శాంతినగర్ లోని ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు


ఎమ్మెల్యే గారి చొరవతో వీధులన్నీ శుభ్రం

గ్రామ పంచాయతీ ఈవో గారికి ప్రత్యేక ధన్యవాదాలు

ఖమ్మం జిల్లా ,కల్లూరు మండలం , కల్లూరు శాంతినగర్ వీధులలో గల కొన్ని ప్రాంతాలలో రెండు రోజులుగా కురిసిన వర్షాల వల్ల ఇళ్లలోకి నీరు చేరి పరిసరాలన్నీ జలమయం అయిన సందర్భంలో గౌరవనీయులైన శ్రీమతి డాక్టర్ మట్ట రాగమయి దయానంద్   దృష్టికి ఎస్డిఎస్( SDS ) బృందం తీసుకెళ్లగా వెంటనే కల్లూరు గ్రామపంచాయతీ ఈవో నాగేశ్వరరావు శరవాణిలో  విషయాన్ని తెలియజేయగా ఈరోజు ఉదయం 8 గంటల నుండి జెసిబి ని శాంతినగర్లోకి అందుబాటులోకి తెచ్చి పూడుకుపోయిన డ్రైనేజీని శుభ్రపరుస్తూ వర్షపు నీటిని డ్రైనేజీలోకి తరలిస్తూ వారి సేవలను శాంతినగర్కు అందిస్తున్నారు , అలాగే సీసీ రోడ్లమీద మట్టి కుప్పలు, కంకర కుప్పలు, బట్టలు ఉతికే రాళ్లు తో శాంతినగర్ వాసులు కొంత సతమతమవుతూ ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా వారుకి తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక చొరవ తీసుకున్న మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏఎంసీ డైరెక్టర్ శ్రీమతి భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, మండల కాంగ్రెస్ నాయకులు భాగం ప్రభాకర్ చౌదరి గారికి శాంతినగర్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు ఖమ్మంపాటి వీరస్వామి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు కమిటీ సభ్యులు అందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాంతినగర్ డెవలప్మెంట్ సొసైటీ టీం, శాంతినగర్ ప్రజలు పాల్గొన్నారు .