ఘనంగా బతుకమ్మ సంబరాలు 

ఘనంగా బతుకమ్మ సంబరాలు 

జనం న్యూస్ సెప్టెంబర్ 30 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కోల్వాయి శ్రీ రామ మోడల్ స్కూల్ లో సొమవారం రోజున అడ్వాన్స్ గా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు 

ఈ సందర్భంగా కరస్పాండెంట్ కొల్ముల రమణ మాట్లాడుతూ తీరొక్క పూవులతో పేర్చిన బతుకమ్మను తోటి ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు 

మన సంస్కృతిని సాంప్రదాయాలను గొప్ప తనాన్ని తెలిపేది బతుకమ్మా పండుగ అన్నారు 

ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కొల్ముల రమణ ప్రిన్సిపాల్ శ్రావణ్ కుమార్ గొడుగు నరెంనదర్ తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు