షాది ఖానా ను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
(జనం న్యూస్) అక్టోబర్ 4 కల్లూరు మండల రిపోర్టర్ సురేష్:- మండల పరిధి లోని షాదీ ఖానా పనులు గత కొంతకాలంగా నిలిచిపోయి ఉన్నందున స్థానిక ముస్లిం సోదరులు ఎమ్మెల్యే మట్టా రాగమయి ని సంప్రదించగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి ఈరోజు షాదీ ఖానాను కలెక్టర్, ఎమ్మెల్యే లు కలిసి పరిశీలించారు.వివరాల్లోకి వెళితే స్థానిక షాది ఖానా పనులు చాలాకాలంగా నిలిచిపోయి కొన్ని అవంతరాలు ఎదురయ్యాయని స్థానిక ముస్లిం పెద్దలు తెలిపారు. ఫారెస్ట్ అధికారుల గెస్ట్ హౌస్ గా ఉన్న 14 కుంటల కాళీ స్థలాన్ని షాదీఖానా ఏర్పాటు కోసం గత ప్రభుత్వ నాయకులను ముస్లిం మత పెద్దలు కోరగా షాది ఖానా నిర్మాణ పనులలో ఉన్నది. ఫారెస్ట్ అధికారులకు ముస్లిం పెద్దలకు మధ్య 14 కుంటల భూమి వివాదాన్ని జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో ఈరోజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన భూమినీ షాదీ ఖానా కోసం ముస్లిం పెద్దలకు అప్పగిస్తూ ఫారెస్ట్ అధికారులకు స్థానిక మండలంలోని గవర్నమెంట్ స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి రాగద్వేషాలు లేకుండా ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడుచుకుంటూ ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగా ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ షాది ఖానా సమస్యను పరిష్కరిస్తామని, ముస్లిం సోదరులు అందరూ సోదర భావంతో మెలగాలని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని , ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఉన్నత చదువులు కూడా అందిస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.