సినిమా కోసం 4రోజుల్లోనే 500 సిగరెట్లు తాగి ఆసుపత్రి పాలైన అల్లరి నరేష్..!

సినిమా కోసం  4రోజుల్లోనే 500 సిగరెట్లు తాగి ఆసుపత్రి పాలైన అల్లరి నరేష్..!

జనం న్యూస్: కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అల్లరి నరేష్. ఒకప్పుడు తను చేసిన సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవి. అయితే ఇప్పుడు తన పంథా మార్చుకున్నారు. కామెడీకి చెక్ పెట్టి సీరియస్ సినిమాలు చేస్తున్నారు. కంటెంట్ ప్రాధాన్యత్ పై ఫోకస్ పెట్టి హిట్స్ అందుకుంటున్నారు. అందుకు ఉదాహరణే నాంది చిత్రం. డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుంది. వీరిద్దరి కలయికలో రాబోతున్న లేటేస్ట్ చిత్రం ఉగ్రం. నరేష్ కెరీర్లో 60వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో మీర్నా మీనన్ కథానాయికగా నటిస్తుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ మూవీ మే 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్.ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఉగ్రం సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో చెప్పారు. ఈ మూవీ కోసం కేవలం నాలుగు రోజుల్లోనే ఐదారువందల సిగరెట్స్ తాగడంతో ఆరోగ్యం దెబ్బతిన్నదని తెలిపారు. “అడవిలో ఓ ఫైట్ సీన్ లో స్మోక్ మిషన్స్ పెట్టారు. ఒక వైపు దట్టంగా పొగ వచ్చేలా మిషన్స్ పెట్టారు. మరోవైపు నన్ను సిగరెట్ తాగుతూ రమ్మంటారు. దాదాపు నాలుగు రోజుల్లో ఐదారువందలు సిగరెట్స్ తాగాను. దీంతో దగ్గు, జ్వరంతో నా ఆరోగ్యం దెబ్బతింది” ఆ సందర్భంలో చాలా రోజుల పాటు ఆరోగ్యం విషమించి ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఎప్పుడూ కామెడీతో నవ్వించే అల్లరి నరేష్.. ఇప్పుడు సీరియస్ పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఉగ్రం సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ క్యూరియాసిటిని పెంచేశాయి. ఇందులో అల్లరి నరేష్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.