ఈ వీడియో చూస్తే మీరు కూడా కచ్చితంగా భయపడిపోతారు..! అమ్మబాబోయ్ అసలెంటిది..

జనం న్యూస్: ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనే మాయలో పడిపోతున్న జనాలు ఏకంగా అన్ని పనులను పక్కనపెట్టి గంటల తరబడి అందులోనే గడిపేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించేందుకు ఎలాంటి పనులు చేసేందుకైనా కూడా సిద్ధమవుతున్నారు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలను ఫణంగా పెట్టి విన్యాసాలు చేసి సోషల్ మీడియాలో లైకులు సంపాదించాలని ఆశపడుతున్నారు. ఇక ఇలాంటి తరహా వీడియోలు ఇటీవల చాలానే ఇంటర్నెట్ లోకి వస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. సోషల్ మీడియాలో పాపులారిటీ రావడం ఏమో కానీ కాస్త అటు ఇటు అయితే చివరికి ప్రాణాలు పోతాయి అని ఇక ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత ఎంతో మంది నేటిజెన్స్ తిట్టిపోస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఇద్దరు పిల్లలు అత్యంత ఎత్తైన భవనంలో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న వీడియో ప్రతి ఒక్కరి ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తుంది అని చెప్పాలి. చైనాలోని హుబై ప్రావిన్స్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా అయితే 27వ అంతస్తు నుంచి ఒక్కసారి కిందికి తొంగి చూస్తేనే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది 27 అంతస్తులు ఉన్న భవనం పైకి ఎక్కిన ఇద్దరు చిన్నారులు.. ఒక భవనం మీద నుంచి మరో భవనం మీదికి అటు ఇటు దూకుతూ విన్యాసాలు చేశారు. వీరిని గమనించిన ఒక వ్యక్తి ఏకంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు హోటల్ యాజమాన్యానికి సమాచారం అందించాడు. హోటల్ యాజమాన్యం ఇక పిల్లలను సురక్షితంగా కిందికి దించారు. ఆ భవనం ఎత్తును చూస్తే ఆ ఇద్దరు పిల్లలు ఎంత ప్రమాదకరమైన విన్యాసాలు చేశారో ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.