హైదరాబాద్ లో దారుణం.. వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన ప్రజలు.. ఎందుకో తెలుసా..?
జనం న్యూస్: హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని కాలనీ వాసులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన శంషాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ప్రకాష్ నగర్ కాలనీకి చెందిన కుమార్ సొంత కుటుంబ సభ్యుల తోపాటు కాలనీలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పలుమార్లు కుటుంబ సభ్యులతోపాటు బస్తీ వాసులు హెచ్చరించారు. సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు.
అయినా దారికి రాకపోవడంతో విసుకు చెందిన కాలనీ వాసులు అతన్ని చెట్టుకు కట్టేసి చితకబాదారు. దీంతో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు. మృతుడు శంషాబాద్ ప్రకాష్ నగర్ కాలనీకి చెందిన కుమార్‌గా గుర్తించారు పోలీసులు . ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కుమార్ పై దాడి పాల్పడ్డ వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.