వామ్మో.. ముగ్గుర్నీ దారుణంగా చంపేసి అంత అమాయకంగా ఎలా నిల్చున్నావు రా నాయనా..!
జనం న్యూస్ : కడలూర్ జిల్లా కారామణికుప్పంలో ముగ్గురిని హత్య చేసిన నిందితుల్లో ఒకడు సాహుల్ హమీద్ ఘటనాస్థలంలో ప్రజలతో కలిసి ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఒకే కుటుంబానికి చెందిన సుధన్ కుమార్, ఇతని తల్లి కమలీశ్వరి(65), ఆయన కుమారుడు నిషాంతన్ హత్యకు గురైంది తెలిసిందే. నిందితులను పట్టుకోవడానికి ఏర్పాటైన 7 ప్రత్యేక పోలీసు బృందాలు సుమారు 200 మంది వద్ద దర్యాప్తు జరిపారు. అదే ప్రాంతానికి చెందిన శంకర్ ఆనంద్ సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అనుమానంతో పోలీసులు ఆయన ఇంటి గోడలపై పడి ఉన్న రక్తపు మరకల ఆధారంగా అరెస్టు చేసి దర్యాప్తు జరిపారు. పాతకక్షల కారణంగా సుధన్‌కుమార్ కుటుంబాన్ని తన స్నేహితుడు సాహుల్ హమీద్‌తో కలిసి హతమార్చినట్లు వాంగ్మూలం ఇవ్వడంతో అతన్ని కూడా అరెస్టు చేశారు. ఘటనా స్థలంలో సాహుల్ హమీద్ ప్రజలతో కలిసి అమాయకంగా అక్కడ జరుగుతున్నదాన్ని చూస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నిందితులిద్దరిని పోలీసులు కడలూర్ కోర్టులో హాజరుపరచి 15 రోజుల రిమాండుకు తరలించారు.