అతివేగం తో మహిళను డీకొన్న కారు..! మహిళ మృతి.. ప్రముకనటుడు జైలుకు..?

అతివేగం తో మహిళను డీకొన్న కారు..! మహిళ మృతి.. ప్రముకనటుడు జైలుకు..?

జనం న్యూస్: అతివేగం ప్రమాదకరమని చెబుతున్నా.. పట్టడం లేదు జనాలకు. చేతిలో వాహనం ఉంటే చాలు వేగంగా దూసుకెళుతూ ఉంటారు. సామాన్యులే కాదూ సెలబ్రిటీలు సైతం రయ్ రయ్ మంటూ దూసుకెళ్లి ప్రమాదం బారిన పడిన సంఘటనలు ఉన్నాయి. ఈ అతివేగం కారణంగా ఓ నటుడు.. మహిళ ప్రాణాలు తీశాడు. ఇంతకు ఆ నటుడు ఎవరంటే.. కన్నడ నటుడు నాగభూషణ. కర్ణాటకలోని బెంగళూరులో ఫుట్ పాత్ పై నడుస్తున్న భార్యా భర్తల జంటను కారుతో బలంగా ఢీ కొనడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో మహిళ చికిత్స పొందుతూ.. మరణించగా.. భర్త పరిస్థితి కూడా ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని ఢీకొట్టే ముందు కూడా నటుడు ఓ విద్యుత్ స్థంభాన్ని బలంగా గుద్దాడని తెలుస్తోంది.శనివారం రాత్రి 9.45 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉత్తరాహాల్ నుండి కోననకుంటే వైపు తన కారులో వేగంగా వెళుతున్న నాగభూషణ..

 బెంగళూరులోని వసంత్ పుర ప్రధాన రహదారి సమీపంలో తొలుత ఓ విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టాడు. వెంటనే అక్కడే ఉన్న ఫుట్ పాత్ పై నడుస్తున్న భార్యా భర్తలను నటుడి కారు బలంగా తాకింది. దీంతో ఆ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిద్దరిని నటుడే స్వయంగా ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే 48 ఏళ్ల మహిళ మృతి చెందగా.. 58 ఏళ్ల భర్త కృష్ణ ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్తకు తలకు, పొట్టకు,కడుపుపై తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాగ భూషణపై రాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యం కింద కుమారస్వామి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అతడిని అరెస్టు చేశారని సమాచారం. ఇటీవల కౌసల్య సుప్రజా రామ అనే చిత్రంలో కనిపించారు. కన్నడలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం అతడు నటించిన తగరు పాళ్య వచ్చే నెలలో విడుదల కానుంది. అతి వేగం కారణంగా నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. గతంలో సాయి ధరమ్ తేజ్ కూడా వేగం కారణంగా ప్రమాద బారిన పడిన సంగతి విదితమే.