ఈ ఫొటోలో ఉన్న ఈ పెద్ద స్టార్ హీరో ఎవరో కనిపెట్టండి చూద్దాం..! 99% ఫెయిల్ అవుతారు..

జనం న్యూస్: స్టార్ హీరోలు సాధారణంగా సినిమాల విషయంలో అస్సలు రిస్క్ చేయరు. కెరీర్ ఎక్కడో డౌన్ ఫాల్ అవుతుందోనని భయపడుతుంటారు. ఒకటి రెండుసార్లు చేసినా సరే ఆల్మోస్ట్ ఆల్ కమర్షియల్ మూవీస్ ఎక్కువగా చేస్తుంటారు. కొందరు మాత్రం రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమా కోసం ప్రాణం పెట్టేస్తుంటారు అలాంటి హీరోలు తెలుగులో ఒకరిద్దరు ఉన్నప్పటికీ మిగతా భాషల్లో చాలామందే ఉన్నారు. పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి కూడా స్టార్ హీరోనే. ఓ మూవీ కోసం తన లుక్ ని పూర్తిగా మార్చేసుకున్నాడు. ఆ ఫొటోలో ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన కనిపిస్తున్న స్టార్ హీరో ఎవరో కాదు చియాన్ విక్రమ్. అప్పట్లో శంకర్ ‘ఐ’ చిత్రం కోసం గూని వ్యక్తిలా కనిపించాడు. ఇప్పుడేమో ఏకంగా డీ గ్లామరైజ్డ్ లుక్ లోకి మారిపోయాడు. ఇదంతా కూడా ‘తంగలాన్’ మూవీ కోసమే. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్య కథతో తీస్తున్న ఈ మూవీకి పా.రంజిత్ దర్శకుడు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్న ఈ మూవీ మేకింగ్ వీడియోని.. విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో విజువల్స్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉండటం విశేషం. ‘తంగలాన్’ మూవీ కోసం టీమ్ చాలానే కష్టపడినట్లు.. మేకింగ్ వీడియోలోని ప్రతి సీన్ లోనూ కనిపిస్తోంది. హీరో విక్రమ్ అయితే పూర్తిగా తన బాడీ షేప్ ని మార్చేసుకున్నాడు. బరువు తగ్గి.. హెయిర్ విషయంలోనూ లుక్ మార్చేశాడు. వీడియోలో ఇతడిని చూస్తే దాదాపు ఎవరూ గుర్తుపట్టలేరు అనేంతగా మారిపోయాడు. ‘అపరిచితుడు’ తర్వాత ఆ రేంజ్ హిట్ పడాలని కోరుకుంటున్న విక్రమ్ కు.. ‘తంగలాన్’ ఆ కోరిక తీర్చేలా కనిపిస్తుంది. మరి పైన ఫొటో చూసిన తర్వాత అతడిని ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.