అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పిక్నిక్ స్పాట్స్ నిఘా

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పిక్నిక్ స్పాట్స్ నిఘా

- విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 25 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
కార్తీక మాసం వారాంతం సందర్భంగా జిల్లాలో విహార యాత్రలకు, పిక్నిక్ లకు ఎక్కువ మంది ప్రజలు వెళ్ళే అవకాశం ఉన్నందున, ఆయా ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రత ఏర్పాట్లు చేపట్టడంతోపాటు, ముందస్తుగా నిఘా ఏర్పాటు చేసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ నవంబరు 24న తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పిక్నిక్ కేంద్రాలు, విహార ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది ఆయా ప్రాంతాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడంతోపాటు, మహిళల భద్రతకు నిఘా ఏర్పాటు చేసారు. యువత లైసెన్సులు లేకుండా వాహనాలను మితిమీరిన వేగంతో నడిపి, ప్రమాదాలకు గురవ్వడం లేదా ప్రమాదాలకు కారకులయ్యే అవకాశం ఉన్నందున ఆయా మార్గాల్లో వాహన తనిఖీలు చేపట్టారని జిల్లా ఎస్పీ తెలిపారు. విహార యాత్రలు నిర్వహించే ప్రాంతాలు, పిక్నిక్ స్పాట్స్ వద్దకు వచ్చే మహిళలు, యువతులు ఈవ్ టీజింగుకు, వేధింపులకు గురి కాకుండా మహిళల భద్రతకు సంబంధిత అధికారులు భద్రత ఏర్పాట్లు చేపట్టడంతోపాటు, డే బీట్లు, బందోబస్తు, మహిళా బీట్లును ఏర్పాటు చేసి, ఎటువంటి అల్లర్లు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారని జిల్లా ఎస్పీ తెలిపారు. పిక్నిక్ పేరుతో అసాంఘిక కార్యకలాపాల నిర్వహణకు తావులేకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి, పేకాట, జూదం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టడంతోపాటు, నిర్వాహకులతో ముందుగా సమావేశమై, అసాంఘిక కార్యకలాపాలు, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరడం, సత్ఫతాలిచ్చింది. ఎక్కడైనా పేకాటలు నిర్వహిస్తే, వారిపై దాడులు నిర్వహించి, వారిని అరెస్టు చేయడం, బెట్టింగులకు వినియోగించిన నగదును సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.ఈ భద్రత ఏర్పాట్లును విజయగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీనివాసరావు, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు పర్యవేక్షించగా, సంబంధిత సిఐలు, ఎస్ఐలు భద్రత చర్యలు చేపట్టారు.