*యోగ ఛాంపియన్ షిప్ లో పతకం సాధించిన ఎఆర్ కానిస్టేబులు* *అభినందించిన -
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*
జనం న్యూస్ 04 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
జాతీయ స్థాయిలో కాంస్య పతకం సాధించిన ఎఆర్ కానిస్టేబులు ఎం.దుర్గా ప్రసాద్
ఇటీవల చత్తీస్గడ్ రాష్ట్ర బిలాయ్ లో నిర్వహించిన ఆలిండియా పోలీసు యోగా ఛాంపియన్షిప్ పోటీలు
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో ఎఆర్ కానిస్టేబులుగా పని చేస్తున్న ఎం.దుర్గా ప్రసాద్ ఇటీవల చత్తీస్ ఘడ్ రాష్ట్రం బిలాయ్ లో జరిగిన ఆలిండియా పోలీసు యోగాశనాల ఛాంపియన్ షిప్ 2024-25 పోటీల్లో పాల్గొని, కాంస్య పతకం సాధించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అక్టోబరు 3న తెలిపారు. బ్రాంజ్ మెడల్ సాధించిన ఎం.దుర్గా ప్రసాద్ జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గార్ని జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా, జిల్లా ఎస్పీగారు ఎఆర్ కానిస్టేబులు ఎం.దుర్గా ప్రసాద్ ను ప్రత్యేకంగా అభినందించి, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించి, మరిన్ని జాతీయ స్థాయి పతకాలు సాధించాలని అభిలషించారు.
రాష్ట్ర పోలీసుశాఖ తరుపున వివిధ జిల్లాల నుండి 23మంది పోలీసు సిబ్బంది, అధికారులు చత్తీస్గడ్ రాష్ట్రం బిలాయ్ లో సెప్టెంబరు 23 నుండి 27 వరకు నిర్వహించిన ఆలిండియా పోలీసు యోగాశనాల ఛాంపియన్షిప్ 2024-25 పోటీల్లో పాల్గొన్నారు. ఈ ఛాంపియన్షిప్లో ప్రదర్శించిన యోగాశనాలకు గాను విజయనగరం జిల్లా ఆర్మ్డ్ రిజర్వువిభాగంలో పని చేస్తున్న ఎం.దుర్గా ప్రసాద్ కాంస్య పతకం సాధించారు. గతంలో కూడా యోగాశనాల ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఎం.దుర్గా ప్రసాద్ మూడు గోల్డ్, మూడు బ్రాంజ్ మెడల్స్, అంతర్జాతీయ యోగా చాంపియన్ షిప్లో ఒక గోల్డ్, ఒక సిల్వర్ మరియు ఒక బ్రాంజ్ మెడల్ సాధించారు. జాతీయ స్థాయిలో పతకంసాధించిన దుర్గా ప్రసాదు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఎన్.గోపాల నాయుడు, ఆర్ఎస్ఐ వర ప్రసాద్ పాల్గొన్నారు.