ఆటో,ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి
జనం న్యూస్,అనంతగిరి
ఆటో, గడ్డివాము ట్రాక్టర్ ఢీకొని సరోజిని(40) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం గ్రామ శివారులో చోటుచేసుకుంది.. అనంతగిరి ఏఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడలో నివాసం ఉంటున్న సరోజిని తన అమ్మగారి ఇంటికి నాయకన్ గూడెం వెళ్లే క్రమంలో మార్గమధ్యలో అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం పెట్రోల్ బంకు వద్ద గడ్డివాము ట్రాక్టర్ డ్రైవర్ సురేష్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడం వల్ల ఆటోను బలంగా ఢీకొనడంతో ఆటో డ్రైవర్ కు బలమైన గాయాలు కావడం, ఆటోలో ప్రయాణిస్తున్న సరోజినీ అక్కడికక్కడే మృతి చెందడంతో సరోజినీ భర్త మల్లయ్య ఆటో డ్రైవర్ వీరబాబు ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనంతగిరి ఏఎస్ఐ లింగారెడ్డి తెలిపారు..